కృష్ణని హౌస్ కీపింగ్ కి వచ్చావా అని అడిగిన గౌతమ్!
on Feb 28, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -92 లో.. కృష్ణ కాలేజీలో మేడం దగ్గరికి వెళ్తుంది. నిన్ను ఒక టీంలో యాడ్ చేస్తున్నాను. ఆ టీం హెడ్ గౌతమ్.. తన దగ్గరికి వెళ్ళమని మేడం చెప్పడంతో అతని దగ్గరికి కృష్ణ వెళ్తుంది. గౌతమ్ కొన్ని ఫైల్స్ కృష్ణకి ఇస్తాడు. "ఈ ఫైల్స్ అన్నీ చూడు.. నేను రౌండ్స్ కి వెళ్ళొస్తా" అని చెప్పి వెళ్తాడు. చిందర వందరగా ఉన్న గౌతమ్ క్యాబిన్ ని కృష్ణ నీట్ గా సర్ది, అందంగా చేస్తుంది.
మరోవైపు మురారి కోసం క్యారేజ్ తీసుకొని ముకుంద స్టేషన్ కి వెళ్తుంది. స్టేషన్ కి వచ్చిన ముకుందని చూసి.. "నువ్వు ఎందుకు తీసుకొచ్చావ్? వేరే ఎవరైనా తెచ్చేవాళ్ళు కదా.. నిన్ను ఎవరైనా చూస్తే ప్రాబ్లమ్ అవుతుంది. ఇదివరకు ఒకసారి ఇలానే వచ్చి వెంకటేష్ అంకుల్ ముందు నన్ను ఇరికించావ్" అని మురారి అనడంతో.. అయితే ఏంటి.. ఎలాగైనా కృష్ణ వెళ్ళిపోతుంది కదా.. అయినా నువ్వు ఏంటి కృష్ణకి గిఫ్ట్ లు ఇస్తున్నావ్? వెళ్ళిపోయేటప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఇల్లు వదిలి వెళ్తుందా అని ముకుంద అంటుంది. "నువ్వు అలా మాటి మాటికి కృష్ణ వెళ్ళిపోతుందని అనకు ముకుంద.. ఒకవేళ కృష్ణకి వెళ్ళడం ఇష్టం లేక నాతోనే ఉంటుందేమో.. కృష్ణ నన్ను ప్రేమిస్తే నేను కూడా తనని ప్రేమిస్తాను. ఒక వేళ కృష్ణ వెళ్ళిపోయినా నేను ఒంటరిగా ఉంటాను కానీ నీతో ఉండను" అని మురారి చెప్తాడు. మురారి మాటలన్ని విన్న ముకుంద ఒక్కసారిగా షాక్ అయి.. ఆదర్శ్ వచ్చినా, కృష్ణ వెళ్ళినా వెళ్ళకున్నా.. నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తానని ముకుంద ఎమోషనల్ అవుతుంది. కాసేపటికి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ముకుంద.
మరోవైపు గౌతమ్ వచ్చేసరికి తన క్యాబిన్ నీట్ గా ఉండడంతో.. ఇదంతా ఎవరు సర్దారని కృష్ణని అడుగుతాడు. "నేనే సర్దాను సర్" అని చెప్తుంది. నువ్వు హౌస్ సర్జన్ చెయ్యడానికి వచ్చావా? హౌస్ కీపింగ్ చేయడానికి వచ్చావా? నాకు ఇలాగ ఉంటే నచ్చదు.. క్యాబిన్ ముందు ఎలా ఉందో అలానే చేయమని గౌతమ్ అంటాడు. అతను అలా అనగానే.. "నాకు సర్దడమే వచ్చు.. పాడు చెయ్యడం రాదు" అని కృష్ణ చెప్తుంది. గౌతమ్ క్యాబిన్ మీద నందు ఫోటో ఉంటుంది. నందు, గౌతమ్ ఒక్కప్పుడు ప్రేమించుకున్నారు. కృష్ణ ఆ ఫోటో చూసేలోపే గౌతమ్ వస్తాడు. నందు ప్రేమించింది గౌతమ్ నే అనే విషయం కృష్ణ కి తెలుస్తుందా? లేదా? తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



